Y.S.Avinash Close Aid G.Uday Kumar Arrest | Connection With Viveka Murder Case

Y.S.Avinash Close Aid G.Uday Kumar Arrest | Connection With Viveka Murder Case

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో అనుమానితుడుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. కడపకు వచ్చిన సీబీఐ సిట్ బృందం అధికారులు పులివెందులకు వెళ్లి ఉదయం 5 గంటలకు సీఆర్పీసీ 160 కింద నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి తీసుకొచ్చారు. కడప కేంద్ర కారాగానికి ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డిని కూడా రమ్మని చెప్పడంతో ఆయన కూడా వచ్చారు. ఆయనతోపాటు న్యాయవాది సూర్యప్రకాశ్ రెడ్డి వచ్చారు. వీరిద్దరి సమక్షంలో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. ఉదయ్ కు సీఆర్పీసీ 41ఏ నోటీసు అందజేసి అరెస్ట్ చేస్తున్నట్లు మెమో కాపీని న్యాయవాదికి, తండ్రి జయప్రకాష్ రెడ్డికి అందజేశారు. రెండు వాహనాల్లో వచ్చిన సిట్ ప్రత్యేక బృందం ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరు పరచడానికి తరలించారు. ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో సాయంత్రం లోపు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ఉదయ్ అరెస్ట్ ను న్యాయవాది సూర్యప్రకాష్ రెడ్డి ధృవీకరించారు
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top